Telangana
English
ఐటీపీ ఏరో-ఇండియా ఉత్పత్తి కేంద్రం
అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణను వ్యూహాత్మక భాగస్వామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణను వ్యూహాత్మక భాగస్వామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ లాంటి నెక్ట్స్ జనరేషన్ సాంకేతికతల్లోనూ రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. మే 5న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం హార్డ్‌వేర్ పార్క్ ఫేజ్-3లో రూ.453 కోట్లతో, 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ‘ఐటీపీ ఏరో-ఇండియా’ ఉత్పత్తి కేంద్రానికి మంత్రి భూమిపూజ చేశారు.