General English

దివీస్‌ ల్యాబొరేటరీస్‌కు ఉత్తమ యాజమాన్య పురస్కారం

దివీస్‌ ల్యాబొరేటరీస్‌కు ఉత్తమ యాజమాన్య పురస్కారం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పురపాలిక పరిధి లింగోజీగూడెంలోని దివీస్‌ ల్యాబొరేటరీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం ‘ఉత్తమ యాజమాన్య పురస్కారం’ అందజేసింది. ఈ పరిశ్రమలో ఏడువేల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పురపాలిక పరిధి లింగోజీగూడెంలోని దివీస్‌ ల్యాబొరేటరీస్‌కు రాష్ట్ర ప్రభుత్వం ‘ఉత్తమ యాజమాన్య పురస్కారం’ అందజేసింది. ఈ పరిశ్రమలో ఏడువేల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో మే 1 నిర్వహించిన మేడే ఉత్సవాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా.గడ్డం వివేక్‌ వెంకటస్వామి... దివీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మధుబాబు, జనరల్‌ మేనేజర్‌ కె.సుబ్బారావులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేశారు. సుహృద్భావ పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సంక్షేమానికి విశేష కృషి చేసినందుకు ఈ పురస్కారాన్ని అందించినట్లు ప్రభుత్వ కార్మిక శాఖ ప్రకటించింది.
Source: Eenadu